Sridevi: శ్రీదేవికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. నమ్మలేకపోతున్నా!: సంజయ్‌ కపూర్‌

  • శ్రీదేవికి హృద్రోగ సమస్యలు ఏమీ లేవు
  • ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది 
  • ఆమెకు గుండెపోటు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాం 
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఆమె మరిది సంజయ్‌ కపూర్ (బోనీకపూర్ తమ్ముడు) మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. తన హోటల్‌ గదిలో శ్రీదేవి స్పృహ కోల్పోయి కనపడిందని, ఆమెను వెంటనే దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. శ్రీదేవికి ఎలాంటి హృద్రోగ సమస్యలు లేవని ఆయన అన్నారు. ఒక్కసారిగా గుండెపోటు ఎలా వచ్చిందో తెలియడం లేదని, ఆమె మృతి చెందిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
Sridevi
sanjay kapoor
dubai

More Telugu News