Talasani: హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో శ్రీదేవి సంతాప సభ: తెలంగాణ మంత్రి తలసాని

  • శ్రీదేవి మృతి చిత్ర పరిశ్రమకే కాకుండా ఆమె అభిమానులకు తీరని లోటు
  • శ్రీదేవి దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించుకున్నారు
  • పద్మశ్రీ అవార్డు, 15 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు
శ్రీదేవి మృతి చిత్ర పరిశ్రమకే కాకుండా ఆమె అభిమానులకు తీరని లోటని తెలంగాణ‌ సినిమాటోగ్రఫీ శాఖ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ లో త్వరలో చిత్ర ప‌రిశ్ర‌మ‌ ప్రముఖుల సమక్షంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి, అలనాటి అగ్ర నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులతో పాటు అనేకమంది నటులతో అనేక చిత్రాలలో నటించి, తన నటనతో అభిమానులను మెప్పించిన నటి శ్రీదేవి అని పేర్కొన్నారు.

తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ తదితర భాషలలో సైతం నటించిన శ్రీదేవి.. దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించుకున్నార‌ని తలసాని అన్నారు. తన నటనకు గాను పద్మశ్రీ అవార్డు, 15 ఫిలింఫేర్ అవార్డులను ఆమె అందుకున్నారని తెలిపారు.  
Talasani
Telangana
Hyderabad
Sridevi

More Telugu News