Uttam Kumar Reddy: ఇదే కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌: ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

  • కేసీఆర్‌కి అహంకారం పెరిగింది
  • ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలి
  • త్వరలోనే తెలంగాణలో బస్సు యాత్ర 
  • కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని, ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు. త్వరలోనే తాము తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్టే కేసీఆర్ ప్రభుత్వానికి చివరిదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలిపారు. సామాజిక మాధ్యమాలను కూడా విస్తృతంగా ఉపయోగించుకుని పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
Uttam Kumar Reddy
KCR
Congress
TRS

More Telugu News