Sridevi: శ్రీదేవి పక్కన నిలబడి నటించడానికి నెర్వస్‌గా ఫీలయ్యాను: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతిపై బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తాను బాలనటుడిగా తొలి సినిమాను శ్రీదేవితో కలిసి చేశానని అన్నాడు. తొలిసారి తొలి షాట్లోనే తాను శ్రీదేవితో కలిసి నటించానని ట్విట్టర్‌లో తెలిపాడు. ఆ సమయంలో శ్రీదేవిలాంటి పెద్ద నటి ముందు నటించడానికి తాను నెర్వస్‌గా ఫీలయ్యానని, తనలో విశ్వాసం నింపడానికి శ్రీదేవి తన చేతులను వణుకుతున్నట్టు చూపించిందని గుర్తు చేసుకున్నాడు.

టెన్షన్ పడుతోన్న తనను ఆమె నవ్వేలా చేశారని, దాంతో నవ్వుతూ చాలా సరదాగా గడిపామని హృతిక్‌ రోషన్‌ తెలిపాడు. శ్రీదేవి అందరికన్నా అద్భుతమైన నటి అని, ఆమెను చాలా మిస్సవుతున్నానని అన్నాడు.
Go Back to Shorts
Sridevi
hritik roshan
Twitter

More Telugu News