RGV: నాగార్జునతో నా కొత్త సినిమా టైటిల్‌, విడుదల తేదీ ఈ రోజు ప్రకటించను: బాధతో చెప్పిన వర్మ

  • ఈ రోజు ప్రకటిస్తానని నిన్న చెప్పిన వర్మ
  • శ్రీదేవి మృతితో నిర్ణయం వాయిదా
  • తరువాత ప్రకటిస్తా: వర్మ
అక్కినేని నాగార్జున హీరోగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్ర‌స్తుతం ఓ సినిమా తీస్తున్నారు. ఈ రోజు ఆ సినిమా పేరుతో పాటు ఫ‌స్ట్ లుక్ విడుదల చేస్తానని నిన్న ఆయన ప్రకటించారు. అయితే, సినీ నటి శ్రీదేవి మృతితో తీవ్ర విచారం వ్యక్తం చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇటువంటి విచారకర సమయంలో తమ కొత్త సినిమా టైటిల్‌ను, విడుదల తేదీని ప్రకటించడానికి తాను, హీరో నాగార్జున సిద్ధంగా లేమని ఆయన పేర్కొన్నారు. ఈ వివరాలను తరువాత ప్రకటిస్తానని చెప్పారు. 
RGV
Nagarjuna
new
Talking Movies

More Telugu News