sridevi: శ్రీదేవి మరణంపై చంద్రబాబు, జగన్ ల స్పందన

  • దిగ్భాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్
  • దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారన్న చంద్రబాబు
  • దేశ చిత్రపరిశ్రమకు తీరని లోటు అన్న జగన్
ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ, శ్రీదేవి మృతి చెందారన్న వార్త తనను బాధకు గురి చేసిందని చెప్పారు. బహుభాషా నటిగా, అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ స్థాయికి ఆమె ఎదిగారని అన్నారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన నటి శ్రీదేవి అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.

శ్రీదేవి మరణం పట్ల జగన్ స్పందిస్తూ... తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి శ్రీదేవి అని చెప్పారు. మరచిపోలేని పాత్రలను పోషించి, అందరినీ మెప్పించారని అన్నారు. ఆమె మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. 
sridevi
Chandrababu
Jagan

More Telugu News