KCR: శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

  • శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
  • అందరి గుండెల్లో ఆమె నిలిచిపోతారు
  • అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు
సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా అభిమానులకు తీరని లోటును మిగులుస్తుందని ఆయన అన్నారు. ఎన్నో సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన శ్రీదేవి... అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. తన అందం, అభినయం, నాట్యాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఎన్నో భాషలలో నటించి, మెప్పించిన ఘనత ఆమె సొంతమని అన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
KCR
sridevi
death

More Telugu News