శ్రీదేవి మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: రవితేజ
- ఆమె మరణం సినీ పరిశ్రమకు భారీ లోటు
- ఆమె స్థానం ఎవరూ భర్తీ చేయలేరు
- శోకసంద్రంలో సినీ పరిశ్రమలు
దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. 'మా నాన్న నిర్దోషి' చిత్రంతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీదేవి తన కెరీర్లో అన్ని భాషల్లోనూ కలిపి మొత్తం 260 సినిమాలు చేశారు. చివరగా హిందీలో 'మామ్' చిత్రం చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్‌తో చేసిన 'క్షణక్షణం' చిత్రానికి గాను ఆమెకు నంది అవార్డు లభించింది. ఇంకా 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులూ ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. 2013లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. అలాంటి అపురూప నటి ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోవడంపై సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.