sridevi: శ్రీదేవి మృతికి ముందు అమితాబ్ ట్వీట్.. ఆందోళనగా ఉందన్న బిగ్ బీ!

  • ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నా అంటూ ట్వీట్
  • శ్రీదేవి మరణానికి కాసేపటి ముందు బిగ్ బీ స్పందన
  • చెడును ముందే గ్రహించగలిగారా?
శనివారం రాత్రి దుబాయ్ లో ప్రముఖ సినీ నటి శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో సోషల్ మీడియా కంటతడి పెడుతోంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ అందరూ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో అమితాబ్ బచ్చన్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీదేవి మరణానికి ముందు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఇప్పుడు ఈ ట్వీట్ పై చర్చించుకుంటున్నారు.

'ఎందుకో తెలియదు. ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణించడాకి కాసేపటి ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు. ఏదో చెడు జరగబోతోందనే విషయం వల్లే ఆయన ఆందోళనకు గురయ్యారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. 
sridevi
death
Amitabh Bachchan
tweet

More Telugu News