sridevi: ఇది ఒక పీడకల అని ఎవరైనా చెప్పండి: విషాదం నుంచి తేరుకోలేకపోతున్న వర్మ

  • షాక్ కు గురైన రామ్ గోపాల్ వర్మ
  • 'శ్రీదేవి నిజంగానే చనిపోయిందా?' అంటూ ప్రశ్న 
  • అందరినీ వదిలేసి ఎలా వెళ్తుందంటూ ఆవేదన
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణవార్తతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాను ఎంతగానో అభిమానించే శ్రీదేవి 'ఇక లేదు' అనే వార్తను ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. 'శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి, ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా?' అని అడిగారు. అందరినీ ఇలా వదిలేసి ఆమె ఒంటరిగా ఇలా ఎలా వెళ్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'క్షణక్షణం' సినిమా సందర్భంగా ఆమెతో కలసి దిగిన ఓ ఫొటోను అప్ లోడ్ చేశారు. 
sridevi
death
ram gopal varma

More Telugu News