BJP: పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోదు: సీఎం రమేశ్‌

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, సీఎం చంద్రబాబు నాయుడు వల్ల ఆ ప్రాంతంలో కియా మోటార్స్ వచ్చిందని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పారు. అయితే, తమ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోదని అన్నారు. అలాంటి సమయంలో రాజీనామాలతో ఉపయోగం లేదని తెలిపారు. పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుందామని అన్నారు. ఈడీ కేసుల కొట్టివేత కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
Go Back to Shorts
BJP
YSRCP
Telugudesam
CM Ramesh

More Telugu News