gopichand: గోపీచంద్ కి గట్టిపోటీనే ఇవ్వనున్న విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
కొంతకాలంగా గోపీచంద్ కి సరైన హిట్ లేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ క్రమంలోనే కథా కథనాలు కొత్తగా అనిపించడంతో ఆయన దర్శకుడు 'చక్రి'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ ఎన్.ఆర్.ఐ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి 'పంతం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 ఆయనకి ఇది 25వ సినిమా కావడంతో, అన్ని విషయాల్లోను జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాను, మే 18వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాకి 'టాక్సీవాలా' అనే టైటిల్ ప్రచారంలో వుంది. విజయ్ దేవరకొండకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువలన గోపీచంద్ కి విజయ్ దేవరకొండ గట్టిపోటీనే ఇవ్వనున్నాడని అంటున్నారు.   
Go Back to Shorts
gopichand
vijay devarakonda

More Telugu News