nani: అవసరాలతో సినిమాకి ఓకే చెప్పేసిన నాని

  • నాని .. అవసరాల మంచి స్నేహితులు
  • నానితో సినిమా చేయాలనుకున్న అవసరాల 
  • తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నాని
'అష్టా చమ్మా' సినిమా నుంచి నాని .. అవసరాల శ్రీనివాస్ మంచి స్నేహితులు. అవసరాల శ్రీనివాస్ ఒక వైపున నటన కొనసాగిస్తూనే మరో వైపున దర్శకుడిగానూ శభాష్ అనిపించుకున్నాడు. ఇక నాని కూడా హీరోగా దూసుకుపోతూ, తాజాగా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది.

 నానితో సినిమా చేసే సమయం కోసం అవసరాల చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా నాని ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని ఒక మల్టీస్టారర్ చేయనున్నాడు. ఆ తరువాత ఆయన హను రాఘవపూడితో ఒక సినిమా చేయవలసి వుంది. గతంలోనే ఒక కథ ఓకే అనేసుకుని వున్నారు. ఈ సినిమాతో పాటు అవసరాల సినిమాను చేయడానికి నాని రెడీ అవుతున్నాడని అంటున్నారు.  
nani
avasarala

More Telugu News