Chandrababu: చంద్రబాబు బయోపిక్ 'చంద్రోదయం' రెడీ... టీజర్ విడుదల!

  • శ్వేతార్క గణపతి పతాకంపై నిర్మాణం
  • దాదాపు పూర్తయిన షూటింగ్
  • చంద్రబాబు బర్త్ డేకి సినిమా విడుదల 
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జీవిత చరిత్ర ఆధారంగా శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై పసుపులేటి వెంకటరమణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'చంద్రోదయం' షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం టీజర్ ను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాళ్లపల్లి సుధారాణి విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో విడుదల చేశారు.

అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ, సినిమాను చంద్రబాబు జన్మదినమైన ఏప్రిల్ 20న విడుదల చేయనున్నామని అన్నారు. బాలీవుడ్ నటులు రఘువర్మ, పల్లవి జోష్, నాగినీడు తదితరులు చిత్రంలో నటించారని తెలిపారు. ఇప్పటికే చిత్రం టీజర్ ను సెక్రటేరియేట్ లో చంద్రబాబు నాయుడికి చూపించామని వెల్లడించారు.
Chandrababu
chandrodayam
Teaser
Vijayawada

More Telugu News