Dipika kakar: ఫైజ్ గా పేరు మార్చుకుని లవర్ ను పెళ్లాడిన నటి దీపికా కకార్!

  • మతం మార్చుకున్న దీపికా కకార్
  • యూపీలో ఇబ్రహీంతో వివాహం
  • 26న ముంబైలో రిసెప్షన్
  • దీపికపై విమర్శల వెల్లువ
బాలీవుడ్ మూవీ 'ససురాల్ సిమర్ కా'తో పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి దీపికా కకార్, తన మతం మార్చుకుని ప్రియుడు షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడటం వివాదాస్పదం అయింది. తన పేరును ఫైజ్ గా మార్చుకున్న దీపిక, యూపీలో ఇబ్రహీంను నిఖా చేసుకుంది. ఆపై 26వ తేదీన ముంబైలో బాలీవుడ్, టీవీ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఇవ్వనున్నట్టు తెలిపింది.

ఆమె మతం మార్చుకోవడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తుండగా, షోయబ్ స్పందిస్తూ, కేవలం పెళ్లి కార్డుపై మాత్రమే ఫైజా అని పేర్కొన్నామని, ఆమె ఇకపై దీపికా ఇబ్రహీంగానే ఉంటుందని చెప్పడం గమనార్హం. మొత్తం మీద ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. 
Dipika kakar
Ibrahim
Uttar Pradesh
Nikkha

More Telugu News