Madhya Pradesh: పరీక్షలు రాసేందుకు వెళ్తున్న 11వ తరగతి విద్యార్థినిని స్కూలు వద్దే తలనరికి చంపిన ప్రేమోన్మాది

  • తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే హత్య
  • కత్తితో గొంతును తెగ్గోసిన నిందితుడు
  • మధ్యప్రదేశ్‌లో పట్టపగలే ఘోరం
పరీక్షలు రాసేందుకు  వెళ్తున్న ఓ విద్యార్థిని స్కూలు గేటు దగ్గరే నరికిచంపాడో ప్రేమోన్మాది. మధ్యప్రదేశ్‌లోని అన్నుపూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. భోపాల్‌కు 550  కిలోమీటర్ల దూరంలోని కోట్మా పట్టణంలో ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. బయాలజీ ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న 11వ తరగతి విద్యార్థిని పూజా పనికపై నిందితుడు దాడిచేసి మెడ, గొంతుభాగంలో కత్తితో నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు.

 అనంతరం కత్తిని అక్కడే పడేసి పరారైనట్టు పేర్కొన్నారు. నిందితుడిని దిలీప్ సాహుగా గుర్తించారు. సాహు తనను వేధిస్తున్నాడంటూ 2014లో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపం పెంచుకున్న దిలీప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Madhya Pradesh
Student
Lover
kill

More Telugu News