Cricket: సఫారీలతో టీమిండియా అంతిమపోరు నేడే!

  • చివరి టీ20 మ్యాచ్ నేడే
  • బ్యాటింగ్, బౌలింగ్ లో పుంజుకున్న సఫారీలు
  • బ్యాటింగ్ లో బలంగా ఉన్న టీమిండియా
సౌతాప్రికా సిరీస్ లో ఆధిక్యం ఎవరిదో తెలిపే నిర్ణయాత్మక మ్యాచ్ నేడు జరగనుంది. టెస్టు సిరీస్ లో ఓటమిపాలైన భారత జట్టు వన్డే సిరీస్ లో అద్భుతంగా పుంజుకుని విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ లో రెండు జట్లు చెరొక విజయంతో సమఉజ్జీలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అంతిమపోరులో విజయం సాధించిన జట్టు ఈ సిరీస్ లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించిన జట్టుగా నిలిచిపోతుంది.

ఈ క్రమంలో రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటుండగా, సఫారీలు కీలక సమయంలో పుంజుకుని సవాలు విసురుతున్నారు. చాహల్, కుల్దీప్ ల మణికట్టు స్పిన్ బలంగా బరిలోకి దిగిన భారత్ గత మ్యాచ్ లలో ప్రత్యర్ధులను కట్టడి చేయగా, టీ20ల్లో హెన్రిచ్ క్లాసెన్, డుమిని ధాటికి చాహల్ భారీ పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చివరి టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. నేటి సాయంత్రం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 
Cricket
south africa vs india
3 rd t20

More Telugu News