rajani: రజనీతో సన్ పిక్చర్స్ భారీ చిత్రం .. తాజా ప్రకటన

  • రజనీ హీరోగా సన్ పిక్చర్స్ వారి సినిమా 
  • దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 
  • త్వరలో సెట్స్ పైకి
ఒక వైపున రజనీకాంత్ 'కాలా' .. '2.ఓ' చిత్రాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాల తరువాత రజనీ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మరో సినిమాను అంగీకరించడం అభిమానుల్లో ఆనందాన్ని పెంచుతోంది.

 రజనీ హీరోగా .. కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా ఫేం) దర్శకత్వంలో తమ తదుపరి సినిమా ఉంటుందని, తాజాగా సన్ పిక్చర్స్ వారు ఒక ప్రకటన చేశారు. సన్ పిక్చర్స్ వారి సినిమా అంటే అది ఎంతటి భారీస్థాయిలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కొన్ని సినిమాలు మాత్రమే చేసినా .. వాటిలో వైవిధ్యం కారణంగా, కార్తీక్ సుబ్బరాజ్ లోని ప్రతిభ కారణంగా ఈ ఛాన్స్ ఆయనకి దక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
rajani
karthik subbaraj

More Telugu News