kakatiya university: కాకతీయ యూనివర్సిటీలో అలజడి.. విద్యార్థుల బాహాబాహీ!

  • పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘం ఆందోళన
  • బంద్‌కు పిలుపు.. కలసిరాని ఇంజనీరింగ్ విద్యార్థులు
  • విద్యార్థి సంఘం, ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ
వరంగల్‌లోని కాకతీయ విశ్వ విద్యాలయంలో అలజడి చెలరేగింది. కాకతీయ వర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు పరస్పరం గొడవ పడడంతో ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగా శాంతియుతంగా ఈ రోజు వర్సిటీ బంద్ లో పాల్గొనాలని విద్యార్థి సంఘం పిలుపు నిచ్చింది.

అయితే, ఈ బంద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్దకు చేరుకుని ఇంజనీరింగ్ విద్యార్థులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘం నేతలు, ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
kakatiya university
students
bundh
fighting

More Telugu News