vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఓ అరడజను వరకూ సినిమాలు వున్నాయి. కంటెంట్ పరంగా వేటికవే కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, వాటిని పూర్తి చేసే పనిలో ఆయన బిజీగా వున్నాడు. ఆయన చేస్తోన్న సినిమాల జాబితాలో, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తో చేస్తోన్న సినిమా కూడా వుంది.

యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మే 18వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను .. ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగిపోయింది. అందువలన ఈ సినిమాకి భారీగానే ఖర్చు పెడుతున్నారట. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరుగుతుందనేది యూనిట్ సభ్యుల మాట. ఈ సినిమా కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.        
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News