somu veerraju: సోము వీర్రాజు తరుచూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు: ఏపీసీసీ

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తోన్న సోము వీర్రాజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా తరుచూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు కోట్ల మంది కోరుకుంటోన్న ప్రత్యేక హోదాకు విరుద్ధంగా ఆయన మాట్లాడడం సరికాదని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు.

కారణాలేమైనా ఆంధ్రప్రదేశ్‌కు మోదీ సర్కారు చేస్తోన్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గళం ఎత్తడం, ఎంపీలతో పార్లమెంటులో ఆందోళన చేయించడం మంచి పరిణామమే అని అన్నారు. కానీ, సోము వీర్రాజు మాత్రం కాకమ్మ కథలు చెబుతూ మభ్యపెట్టాలనుకుంటున్నారని అన్నారు.
Go Back to Shorts
somu veerraju
Andhra Pradesh
Special Category Status

More Telugu News