justin trudaeu bhangra: బాంగ్రా డ్యాన్స్ తో ఉర్రూతలూగించిన కెనడా ప్రధాని ట్రూడో... వీడియో చూడండి

  • ఢిల్లీలోని కెనడా హౌస్ లో కార్యక్రమం
  • ఈ సందర్భంగా బాంగ్రా స్టెప్పులేసిన ట్రూడో
  • సభికుల నుంచి హర్షద్వానాలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాంగ్రా డ్యాన్స్ తో అతిథులను హుషారెత్తించారు. ఢిల్లీలో నిన్న సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. కెనడా హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ట్రూడో తన సతీమణి సోఫి ట్రూడోతో కలసి హాజరయ్యారు. వేదికపైకి స్టెప్పులేస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా మరోసారి స్టెప్పులేసి అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు.

ఆయన డ్యాన్స్ చేసిన తీరుకు అక్కడున్న వారు తమ హర్షధ్వానాలతో అభినందించారు. కెనడా ప్రధాని ట్రూడో ఏడు రోజుల పర్యటనకు భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఆరో రోజైన నేడు ప్రధాని, ఇతర ప్రభుత్వ ప్రముఖులతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు.
justin trudaeu bhangra

More Telugu News