Pawan Kalyan: మనసు పొరల్లో సమాధి కాబడిన పాత జ్ఞాపకాలు... రేణూదేశాయ్ కవితకు పవన్ ఫ్యాన్స్ ఫిదా!

  • మదిలోని బాధను కవిత రూపంలో చెప్పుకున్న రేణూ దేశాయ్
  • ఎన్నో సమాధి కాబడిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని బాధ
  • ఓదార్పు వ్యాఖ్యలతో అనునయిస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ కవితను చదువుతూ 49 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పెట్టగా, దాన్ని చూసిన అభిమానులు ఫిదా అవుతూ 'సూపర్ వదినా', 'అదిరిపోయింది వదినా' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్' అనే పేరుతో యూ ట్యూబ్ లో విడుదలైన ఈ కవితలో...

మనసు పొరల్లో సమాధి కాబడిన జ్ఞాపకాలు
వాటిని నేను మళ్లీ మళ్ళీ చూసుకుంటున్నాను
ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు నా మదిలో చెరిగిపోని రాతలే
ఇప్పటికీ అవన్నీ నా మనసు పొరల్లో జ్ఞాపకాలే
క‌మ్ముకున్న మంచు క‌రిగిపోయి
ఇంకోసారి అవే జ్ఞాప‌కాలు క‌ళ్ళెదుట నిలిచాయి.
విధి ఎంత బ‌లీయమైన‌ది కాకుంటే,
మ‌న‌సులో ఎక్కడో పాతుకుపోయిన
జ్ఞాప‌కాల‌ను ఎందుకు మ‌ళ్ళీ త‌ట్టి లేపుతుంది?
ఆ జ్ఞాప‌కాల‌ని మ‌ళ్ళీ చూసుకుంటే
ఓ తుప్పు ప‌ట్టిన క‌లం, దానితో రాసుకున్న పేరు
ముక్క‌లైన నా హృద‌యం,
నేను రాసుకున్న లేఖ‌ల కాగిత‌పు ముక్క‌లు మాత్ర‌మే కనిపించాయి...
అంటూ తనలోని బాధను రేణూ దేశాయ్ పంచుకుంది. ఈ కవితలో ఎవరి పేరునూ ప్రస్తావించకున్నా, ఆమె కచ్చితంగా పవన్ ను ఉద్దేశించే ఈ కవిత రాసుకుందని నమ్మేస్తున్న ఫ్యాన్స్, రేణు మనసులోని బాధే ఇదని భావిస్తూ, ఆమెను అనునయిస్తూ, ట్వీట్లు పెడుతున్నారు.
Pawan Kalyan
Renu Desai
You Tube
Poem
Video

More Telugu News