రైల్వే స్టేషన్లో పబ్లిగ్గా ముద్దు పెట్టాడు... చక్కగా వెళ్లిపోయాడు... సీసీ ఫుటేజ్!

షార్ట్స్‌లో చూడండి
పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా, అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ లో పలువురు ప్రయాణికులు చూస్తుండగానే, ఓ కామాంధుడు యువతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీటీటీవీలో రికార్డు అయ్యాయి. ఫోన్ లో మాట్లాడుకుంటూ అమ్మాయి వెళుతుండగా, అమె వెనకే వచ్చిన ఆ వ్యక్తి, ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు.

 ఆపై అమ్మాయి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అతను తనను స్టేషన్ బయటి నుంచే వెంబడిస్తూ వచ్చాడని చెప్పింది. ఆ వెంటనే అక్కడి సీసీటీవీ రికార్డులన్నీ ముందేసుకున్న పోలీసులు, అతనున్న ప్రాంతాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని పేరు కే నరేష్ జోషి (43) అని వెల్లడించారు. ఇదిలావుండగా, అతను అమ్మాయిని వేధిస్తున్న సమయంలో చుట్టు పక్కల ఎంతో మంది ఉన్నప్పటికీ, ఎవరూ స్పందించక పోవడం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Mumbai
Railway Station
Harrasment
Kiss

More Telugu News