kajal: ఓవర్సీస్ లో 'అ!' సినిమా హవా .. థియేటర్ల పెంపు!

షార్ట్స్‌లో చూడండి
నాని నిర్మాతగా ఇటీవల 'అ!' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా ఏ సెంటర్స్ లో ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ఓవర్సీస్ లోను నాని సినిమాలకి మంచి ఆదరణ వుంది. ఆయన నిర్మించిన సినిమా కావడంతో .. ఆయన టేస్టుకు తగినట్టుగానే ఉంటుందని భావించారు.

ఫలితంగా అక్కడి థియేటర్స్ దగ్గర తొలి రోజునే సందడి మొదలైంది .. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తూ 6.7 లక్షల డాలర్లను వసూలు చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు మరి కొన్ని థియేటర్స్ ను యాడ్ చేశారు. కొత్తగా యాడ్ చేసిన థియేటర్స్ లో ఈ రోజు నుంచి ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. విభిన్నమైన కథా కథనాలు .. విలక్షణమైన పాత్రల కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.        
Go Back to Shorts
kajal
regina
nithya

More Telugu News