సమయానికంటే ముందే వచ్చినా.. ప్రయాణికుడిని విమానం ఎక్కనివ్వని 'ఇండిగో'
- మరోసారి ఇండిగో ఎయిర్లైన్స్ పై ఆరోపణలు
- వీడియోలో తన బాధ చెప్పుకున్న ప్రయాణికుడు
- హైదరాబాద్ నుంచి గోవా వెళ్లడానికి 6ఈ-743 విమానం ఎక్కడానికి వచ్చాను
- విమానం ఎక్కకుండా అడ్డుపడ్డారు
తాను హైదరాబాద్ నుంచి గోవా వెళ్లడానికి 6ఈ-743 విమానం ఎక్కడానికి, రావాల్సిన సమయం కంటే ముందుగానే వచ్చానని ఆ వీడియోలో తెలిపాడు. అయినప్పటికీ విమాన సిబ్బంది ఆలస్యంగా వచ్చానని తనను విమానం ఎక్కనివ్వలేదని అన్నాడు. అతడితో పాటు ఓ మహిళ, పిల్లాడు కూడా ఉన్నారు. వారిని కూడా విమానం ఎక్కడానికి అంగీకరించలేదని తెలిసింది. విమానం వద్దకు వెళ్లడానికి ఎయిర్పోర్టులో కేటాయించిన బస్సుని కూడా తాము ఎక్కామని, ఒకవేళ తాము ఆలస్యంగా వస్తే బస్సు ఎందుకు ఎక్కనిస్తారని ఆయన అడిగాడు.