Andhra Pradesh: ఆ కక్షను ఏపీ ప్రజలపై మోదీ తీర్చుకుంటున్నారు : సీపీఐ నారాయణ

  • చంద్రబాబుకు, మోదీకి పాతకక్షలున్నాయి
  • మోదీ పాలన నియంతృత్వంతో కూడుకున్నది
  • ఫ్యాక్షనిస్టులకు మరో రూపం మోదీ: నారాయణ తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు, మోదీకి పాత కక్షలు ఉన్నాయని, ఆ కక్షను ఏపీ ప్రజలపై మోదీ తీర్చుకుంటున్నారని సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ పాలన నియంతృత్వంతో కూడుకున్నదని, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విభజన హామీలు నెరవేర్చేందుకు అందరూ కలసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. కాగా, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ అవసరం లేదని, ప్రత్యేక హోదా మాత్రమే కావాలని నారాయణ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకహోదా కోసం పోరాడేటట్టు అయితేనే అఖిలపక్షంతో తాము కలుస్తామని, లేకపోతే లేదని నారాయణ పేర్కొనడం విదితమే.
Andhra Pradesh
Chandrababu
CPI Narayana

More Telugu News