Tollywood: రాజకీయాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లను: సినీ నటుడు శ్రీకాంత్

  • రాజకీయాలపై నాకు అవగాహన లేదు
  • వాటి జోలికి వెళ్లను..ఇమడలేను
  •  అయితే, రాజకీయాల్లోకి ఎవరు వెళ్లినా సక్సెస్ కావాలి: శ్రీకాంత్
రాజకీయాల్లోకి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనని, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నానని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ నుంచి పిలుపు వస్తే వెళతారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, రాజకీయాలపై తనకు అవగాహన లేదని అన్నారు. అయితే, రాజకీయాల్లోకి ఎవరు వెళ్లినా సక్సెస్ కావాలని మాత్రం కోరుకుంటాను తప్ప, తాను మాత్రం వాటి జోలికి వెళ్లనని, వాటిలో ఇమడలేనని అన్నారు. 
Tollywood
srikanth

More Telugu News