Badminton: బ్యాడ్మింటన్ లోనూ ఫిక్సింగ్ భూతం... లీ చోంగ్ వెల్లడించిన సంచలన నిజం!

  • సహచర ఆటగాళ్లను చూసి తలదించుకుంటున్నా
  • గతంలో బుకీలు నన్ను కూడా సంప్రదించారు
  • అప్పట్లో గట్టిగా తిరస్కరించానన్న లీ చోంగ్
క్రికెట్ సహా పలు క్రీడాంశాల్లో చిచ్చు రేపిన ఫిక్సింగ్ భూతం బ్యాడ్మింటన్ నూ తాకింది. మలేషియాకు చెందిన స్టార్ షట్లర్ లీ చోంగ్ వీ సంచలన విషయాన్ని వెల్లడిస్తూ, గతంలో ఓ కీలక మ్యాచ్ ని ఫిక్సింగ్ చేయాలని తనను బుకీలు సంప్రదించారని, తాను అప్పట్లో వారి కోరికను గట్టిగా తిరస్కరించానని అన్నారు. మలేషియాకు చెందిన ఇద్దరు షట్లర్లు ఫిక్సింగ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలు రావడంపై లీ చోంగ్ స్పందించాడు.

తన సహచర ఆటగాళ్ల ప్రవర్తనతో తాను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. మలేషియా దేశ గౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యమని అన్నాడు. కాగా, ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆటగాళ్లపై ఈ నెలాఖరులో బీడబ్ల్యూఎఫ్ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) విచారణ చేపట్టనున్న సంగతి తెలిసిందే.
Badminton
Fixing
Malaysia

More Telugu News