Andhra Pradesh: ఏపీకి నిధులు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది!: కొడాలి నాని వ్యంగ్యం

  • టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే నిధులు రావడం ఖాయం
  • ఇంతకాలం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు భజన చేశారు?
  • జగన్ ప్రకటనలతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు: నాని
కేంద్రం నుంచి ఏపీకి నిధులు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని, తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తే నిధులొస్తాయంటూ వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపైన ఆయన విమర్శలు గుప్పించారు.

 ఏపీకి కేంద్రం ఏ విధంగానూ సాయం చేయకపోతే ఇంతకాలం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు భజన చేశారో చెప్పాలని, ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తానడం, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతానంటూ జగన్ చేసిన ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని నాని విమర్శించారు.
Andhra Pradesh
Kodali Nani
YSRCP

More Telugu News