Tollywood: ఆచార్య ఆత్రేయ నాకు దైవంతో సమానం: సినీ పాటల రచయిత చంద్రబోస్

  • చంద్రబోస్ కు ఆత్రేయ పురస్కారం  
  • ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది: చంద్రబోస్
  •  మంచి పాటలను అందిస్తున్న గొప్ప రచయిత : స్పీకర్ ప్రశంసలు
ఆచార్య ఆత్రేయ తనకు దైవంతో సమానమని, ఈ పురస్కారం అందుకోవడం తనకు సంతోషంగా ఉందని ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘స్వరాభిషేకం’ పేరిట నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఆత్రేయ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, చంద్రబోస్ ను అభినందించారు. మంచి పాటలను అందిస్తున్న గొప్ప రచయిత చంద్రబోస్ అని కొనియాడారు. కాగా, ఇదే వేదికపై ప్రముఖ గాయని సురేఖామూర్తికి ఆత్మీయ సత్కారం, బి.శ్రీనివాస్ కు ఘంటసాల పురస్కారం అందజేశారు.
Tollywood
chandra bose

More Telugu News