Kamal Haasan: పక్కా ముహూర్తం ప్రకారమే రంగంలోకి కమల్!

షార్ట్స్‌లో చూడండి
పార్టీ ప్రకటించి రాజకీయ బరిలోకి దిగిన ప్రముఖ నటుడు కమల హాసన్ పక్కా ముహూర్తం ప్రకారమే రంగంలోకి దూకారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ద్రవిడ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని ప్రకటించిన కమల్ నిజానికి నాస్తికుడు. దేవుళ్లు, ముహూర్తాలపై ఏమాత్రం నమ్మకం లేని ఆయన పార్టీని మాత్రం శుభముహూర్తం ప్రకారమే ప్రకటించినట్టు చెబుతున్నారు.

కమల్ బుధవారం పార్టీని ప్రకటించినప్పుడు భరణి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రంలో పుట్టినవారు ధరణిని ఏలుతారన్నది తమిళుల విశ్వాసం. కమల్ కూడా దీనిని విశ్వసించే ఆ నక్షత్రంలో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. దీనికి తోడు బుధవారం తిథి షష్టి కూడా ఆయనకు కలిసి వచ్చిందంటున్నారు. ఈ రెండూ సరిగ్గా కుదరడం వల్లే కమల్ తన పార్టీ ప్రకటనకు బుధవారాన్ని ఎంచుకున్నారని అంటున్నారు.  
Go Back to Shorts
Kamal Haasan
Tamilnadu
Actor
Party

More Telugu News