south africa: రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం

షార్ట్స్‌లో చూడండి
సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్ పై 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం, బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 18.4 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ముఖ్యంగా,  కెప్టెన్ డుమినితో పాటు క్లాసన్ తమ బ్యాటింగ్ తో రెచ్చిపోవడంతో రెండో టీ 20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

భారత్ స్కోరు : 188/4 (20 ఓవర్లు) 

దక్షిణాఫ్రికా స్కోరు : 189/4 (18.4 ఓవర్లు)


భారత్ బ్యాటింగ్ : శిఖర్ థావన్ (24), రోహిత్ శర్మ (0), రైనా (31), కోహ్లీ (1), పాండే 79, ధోనీ 52 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ : హెన్ డ్రిక్స్ (26), జేటీ స్మట్స్ (2), హెచ్ క్లాసెస్ (69), మిల్లర్ (5), జేపీ డుమిన్ 64, బెహర్దీన్ 16 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
Go Back to Shorts
south africa
India
centurian

More Telugu News