Kamal Haasan: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు బహిరంగ సభకు పయనమైన కమల హాసన్‌

  • తమిళనాడులో మరికాసేపట్లో మరో కొత్త పార్టీ ప్రారంభం 
  • తన పార్టీ పేరు, విధానాలు, వివరాలు ప్రకటించనున్న కమల్
  • కమల్‌ వద్దకు చేరుకున్న కేజ్రీవాల్‌
తమిళనాడులో మరికాసేపట్లో మరో కొత్త పార్టీ ప్రారంభం కాబోతోంది. సినీనటుడు కమల హాసన్ కాసేపట్లో మధురై ఒత్తకడై మైదానంలో బహిరంగ సభలో తన పార్టీ పేరు, విధానాలు, వివరాలు ప్రకటించనున్నారు. కమల హాసన్ ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి మధురై చేరుకుని కమల హాసన్ ఇంటికి వెళ్లి కలిశారు. కేజ్రీవాల్‌తో కలిసి కమల హాసన్ బహిరంగ సభకు బయలుదేరారు. బహిరంగ సభ ప్రాంగణం వద్దకు భారీగా కమల్ అభిమానులు చేరుకున్నారు.
Kamal Haasan
Arvind Kejriwal
New Delhi
Tamilnadu

More Telugu News