Kamal Haasan: కమల్ ట్వీట్ కు కేటీఆర్ స్పందన.. తిరిగి స్పందించిన విలక్షణ నటుడు!

  • కమల్ రాజకీయ పార్టీ ప్రకటన సందర్భంగా కేటీఆర్ కు ఆహ్వానం
  • రాలేకపోతున్నానని ట్వీట్ చేసిన కేటీఆర్
  • మీ రాకను మిస్సవుతున్నామంటూ తిరిగి స్పందించిన కమల్
విలక్షణ నటుడు కమలహాసన్ తన రాజకీయ పార్టీని మధురై వేదికగా ఈరోజు సాయంత్రం ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా కమల్ నుంచి ఆహ్వానం అందింది.

అయితే, ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన కమల్ కు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నానని, నిజ జీవిత ‘నాయకుడు’ కూడా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్ లో ఆకాంక్షించారు.

 ఇందుకు స్పందించిన కమల్..‘థ్యాంక్యూ కేటీఆర్ జీ. మీ రాకను మిస్సవుతున్నాం. భవిష్యత్తులో జరిగే మా కార్యక్రమాలకు మీరు హాజరై వాటికి మరింత శోభను తీసుకు వస్తారని భావిస్తున్నా. ఎంతో బిజీగా ఉండే మీరు, దయచేసి మాకు కూడా కొంత సమయం కేటాయించండి’ అని కమల్ పేర్కొన్నారు. 
Kamal Haasan
KTR

More Telugu News