adi godrej: ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాల్సిన సమయం ఇదే: గోద్రెజ్ అధినేత

  • ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించనుండడం మంచి నిర్ణయం
  • అలాగే ప్రభుత్వరంగ బ్యాంకులను కూడా చేయాలి
  • వాటాలు విక్రయించడం కాదు
ప్రభుత్వరంగంలో ఎక్కువ బ్యాంకులు ఉండాల్సిన అవసరం లేదని గోద్రేజ్ గ్రూపు అధినేత, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆది గోద్రెజ్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ఆయన సూచించారు. ‘‘ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరిస్తుండడం మంచి నిర్ణయం. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులను కూడా ప్రైవేటీకరిస్తే మంచి చర్య అవుతుంది’’ అన్నారు గోద్రెజ్.

ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద స్కామ్ లు జరిగినట్టు తాను ఇప్పటివరకు వినలేదన్నారు. కంపెనీల్లో అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయని, అయితే ప్రైవేటు రంగంలో మరింత్ర నియంత్రణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కాకుండా చురుగ్గా బ్యాంకులను ప్రైవేటీకరించాలని సూచించారు.
adi godrej
public sector banks

More Telugu News