Kamal Haasan: అందుకే, కమలహాసన్‌ తన కొత్త పార్టీ ప్రకటనకు ఈ రోజే ముహూర్తం పెట్టింది!

  • నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
  • కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కమల్‌
  • సాయంత్రం కొత్త పార్టీ ప్రకటన
సినీనటుడు కమల హాసన్ ఈ రోజు సాయంత్రం మధురైలో తన కొత్త పార్టీ పేరు, పార్టీ సిద్ధాంతాలు ప్రకటించనున్న విషయం తెలిసిందే. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన వారంతా పార్టీ పేరును ఏదైనా ప్రత్యేకత వున్న రోజున ప్రకటిస్తారు. తమ పుట్టినరోజు లేక మహాత్ముల జన్మదినోత్సవం నాడు తమ కొత్త పార్టీలను ప్రకటించిన వారు చాలా మంది ఉన్నారు.

మరి కమల హాసన్ ఈ రోజే తన పార్టీ ప్రకటన ఎందుకు చేయనున్నారో తెలుసా? ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా కమల్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం రామేశ్వరానికి చేరుకున్న కమల హాసన్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం కుటుంబీకులను కలిసి వారితో కాసేపు మాట్లాడి, ఆ తరువాత మత్య్సకారులతో భేటీ అయ్యారు.  
Kamal Haasan
politics
Tamilnadu

More Telugu News