టీచర్ కు ఏడో తరగతి విద్యార్థి బెదిరింపు... ఏంటో తెలిస్తే అవాక్కే!

తనకు విద్యాబుద్ధులు నేర్పించే ఓ ఉపాధ్యాయురాలిని, తన క్లాసులోనే చదువుతున్న ఆమె కుమార్తెనూ రేప్ చేస్తానని ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి బెదిరించగా, అదే పాఠశాలలో ఎనిమిదో క్లాస్ చదువుతున్న మరో విద్యార్థి టీచర్ కు అసభ్యకర ఈ-మెయిల్ పంపాడు. ఈ రెండు ఘటనలూ గుర్ గ్రామ్ లోని ఓ పాఠశాలలో జరుగగా, ఇద్దరినీ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసి కౌన్సెలింగ్ కు పంపింది. విద్యార్థులు మైనర్లు కావడంతో వారి పేర్లతో పాటు, పాఠశాల పేరును వెల్లడించేందుకూ అధికారులు నిరాకరించారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సరిగ్గా చదవడం లేదని సెవెన్త్ క్లాస్ విద్యార్థిని టీచర్ మందలించగా, ఆమెపై, ఆమె కుమార్తెపై అత్యాచారం చేస్తానని ఆన్ లైన్ మాధ్యమంలో బెదిరింపు మెయిల్ పంపాడు. దీన్ని చూసిన ఆ బాలిక పాఠశాల మానేసింది. దీనిపై సదరు టీచర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఇదిలావుండగా, అదే సమయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన టీచర్ ను శృంగారానికి ఆహ్వానించాడు. విషయం తెలుసుకున్న మేనేజ్ మెంట్ ఈ ఇద్దరినీ ఇంటికి పంపేసింది.

Gurugram
School
Teacher
Students
Suspend
Councelling

More Telugu News