ఉగ్రవాదులు లక్ష్యంగా సిరియా బాంబుల వర్షం... 200 మంది పౌరుల మృతి!
- తూర్పు గౌటాపై విరుచుకుపడిన సైన్యం
- 57 మంది చిన్నారులు సహా 200 మంది మృతి
- క్షతగాత్రులతో కిక్కిరిసిన ఆసుపత్రులు
- మరో దాడికి అవకాశం
సోమవారం నాటి దాడుల్లో ప్రాణనష్టం అధికంగా ఉందని, గాయపడిన వారి పరిస్థితి మరింత దయనీయమని, ఆసుపత్రుల్లో వారికి చికిత్స కష్టమవుతోందని తెలిపింది. మూడేళ్ల క్రితం డమాస్కస్ శివార్లలో జరిపిన దాడి తరువాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. గౌటాలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం ఉంటుండగా, ఇక్కడ మరోసారి సైన్యం దాడికి పాల్పడవచ్చని 'అల్ వతన్' పత్రిక అభిప్రాయపడింది. ఇక్కడి సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.