Kamal Haasan: ఆ పాఠశాలను కమల్ సందర్శించేందుకు వీల్లేదంటూ ఫిర్యాదు!
ప్రముఖ నటుడు కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధురై వేదికగా తన రాజకీయ పార్టీని రేపు ఆయన ప్రకటించనున్నారు. కాగా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ స్వస్థలమైన రామేశ్వరం వెళ్లి ఆయన చదువుకున్న పాఠశాలను సందర్శించాల నికమల్ అనుకున్నారు. అయితే, ఆ పాఠశాలను కమల్ సందర్శించేందుకు వీలు లేదంటూ తమిళనాడులో హిందూ మున్నానీ అనే హిందూ సంస్థ డిమాండ్ చేసింది. రాజకీయాలకు పాఠశాలలను దూరంగా పెట్టాలని కోరుతూ రామనాథపురం కలెక్టర్ కు ఓ వినతిపత్రం సమర్పించింది. కమల్ ను అక్కడికి రాకుండా చూడాలని ఆ వినతిపత్రంలో కోరింది.