Pawan Kalyan: ఆదివాసీల నుంచి హెచ్చరికలు వస్తోన్న నేపథ్యంలో.. రేపటి 'పవన్ కల్యాణ్ శ్రీకాకుళం పర్యటన' రద్దు
- శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని కొన్ని రోజుల ముందు చెప్పిన పవన్
- మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్
- ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత
- వెనక్కుతగ్గిన పవన్
తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు, తమను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న వారి డిమాండుకు మద్దతు తెలిపేందుకు ఆ ప్రాంతంలో పవన్ పర్యటించాలనుకున్నారు. అయితే, ఆయన పర్యటన రద్దయింది.
ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో పవన్ వెనక్కు తగ్గారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చితే ఊరుకోమని హెచ్చరిస్తోన్న గిరిజనులు పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు.
ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో పవన్ వెనక్కు తగ్గారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చితే ఊరుకోమని హెచ్చరిస్తోన్న గిరిజనులు పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు.