chiranjeevi: రీ షూట్లు అవసరం లేదని చిరూను చరణ్ ఒప్పించాడట!

  • 'రంగస్థలం' చూసిన చిరూ 
  • కొన్ని సీన్స్ రీ షూట్ చేయమంటూ సూచన
  • సుకుమార్ పై నమ్మకముంచిన చరణ్
'రంగస్థలం' సినిమాను సుకుమార్ ఒక దృశ్యకావ్యంలా మలుస్తున్నాడు. చరణ్ .. సమంత పాత్రలకి సంబంధించి వదిలిన టీజర్స్ తో అందరికీ ఈ విషయం అర్థమైపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల విషయంలో చిరంజీవి కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సీన్స్ వరకూ రీ షూట్ చేస్తే బాగుంటుందని సుకుమార్ కి చిరంజీవి సూచించాడని చెప్పుకున్నారు.

అయితే సుకుమార్ రీ షూట్ పెట్టలేదు .. అందుకు కారణం చరణ్ అనే టాక్ తాజాగా వినిపిస్తోంది. 'రంగస్థలం'లో రీ షూట్ చేయమని చిరూ చెప్పిన సన్నివేశాల విషయంలో చరణ్ ఆయనకి సర్ది చెప్పాడట. ఆ సీన్స్ బాగానే వచ్చాయనీ .. తనకి సుకుమార్ పై పూర్తి నమ్మకం వుందంటూ చిరూను కన్వీన్స్ చేశాడట. దాంతో చిరంజీవి ఒప్పుకోక తప్పలేదని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.    
chiranjeevi
sukumar
charan

More Telugu News