sylvester stallone: సిల్వెస్టర్ స్టాలోన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. నిక్షేపంగా ఉన్నానన్న స్టాలోన్!

షార్ట్స్‌లో చూడండి
ప్ర‌ముఖ హాలీవుడ్‌ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ చ‌నిపోయాడంటూ నేటి ఉదయం నుంచి సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీంతో పలువురు నెటిజన్లు స్టాలోన్ కు సంతాప సందేశాలు పెట్టడం ప్రారంభించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిల్వెస్ట‌ర్ స్టాలోన్...త‌న ఇన్ స్టా గ్రాం ఖాతా ద్వారా తాను బతికే ఉన్నానని, ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నానని, ఇంకా ఫైట్లు చేసేంత బలంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు.

ఈ పుకార్లపై స్టాలోన్ సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్ర‌తికున్న వ్య‌క్తిని చంపేవారి‌కి స‌మాజంలో ఉండే అర్హ‌తే లేద‌ని అన్నాడు. కాగా, ఇంతకీ  ఈ పుకారెలా పుట్టిందంటే, స్టాలోన్ తాజా సినిమాలో పాత్ర కోసం కొత్త గెటప్ వేసుకున్నాడు. జుట్టు ఊడిపోయి, శరీరం వడలిపోయి ఉన్న ఆ గెటప్ తాలూకు ఫొటోలు బహిర్గతమయ్యాయి. దీంతో ఆయన కేన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, సోమ‌వారం నిద్ర‌లోనే క‌న్నుమూశార‌ని పుకార్లు పుట్టించారు. ఇది తెలియని నెటిజన్లు ఆ ఫోటోలను షేర్ చేస్తూ, అవే నిజమని నమ్మి, రిప్' (RIP) సందేశాలు పెడుతున్నారు.     
Go Back to Shorts
sylvester stallone
sylvester stallone death
Social Media

More Telugu News