Chandrababu: రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరి అభిప్రాయాలు తీసుకుందాం: సీఎం చంద్రబాబు

  • కొనసాగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
  • విశాఖ భాగస్వామ్య సదస్సు తర్వాత ఓ సమావేశం ఏర్పాటు చేద్దాం
  • హక్కుల సాధన కోసం పోరాడే వారిని ఈ సమావేశానికి ఆహ్వానిద్దాం : చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరి అభిప్రాయాలు తీసుకుందామని, రాజకీయ పార్టీలతో పాటు పార్టీలకతీతంగా పోరాడే వారి సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖ భాగస్వామ్య సదస్సు తర్వాత అందరితో సమావేశం ఏర్పాటు చేద్దామని, హక్కుల సాధన కోసం పోరాడే వారినీ ఈ సమావేశానికి ఆహ్వానిద్దామని అన్నారు. 

అఖిల పక్ష సమావేశం కాదు, అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేద్దామని, తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన అన్నారు. సంక్షోభ సమయంలో ఎవరూ తొందరపడి మాట్లాడొద్దని ఈ సందర్భంగా తమ నేతలకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News