charan: రెండు మెగా ఫంక్షన్లకు రెడీ అవుతోన్న 'రంగస్థలం'

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగస్థలం' సినిమా దాదాపు షూటింగును పూర్తి చేసుకుంది. దాంతో చరణ్ .. భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చిన తరువాత బోయపాటి శ్రీను సినిమా చేయనున్నాడు. 'రంగస్థలం' సినిమా రిలీజ్ మార్చి 30వ తేదీన అనే విషయాన్ని ఆల్రెడీ ప్రకటించేశారు. అందువలన ఈలోగా మిగతా పనులను చకచకా పూర్తిచేయడంలో ఈ సినిమా టీమ్ నిమగ్నమై వుంది.

ఈ సినిమా ఆడియో వేడుకను వైజాగ్ లో నిర్వహించాలనీ .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనేది ఖరారు చేసుకున్నారు. ఇక ఆడియో వేడుకకు డేట్ ను ఖరారు చేసే పనిలో వున్నారు.  సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు .. ఆది పినిశెట్టి .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు.   
Go Back to Shorts
charan
samanta

More Telugu News