Ramgopal Varma: తెలుగు న్యూస్ చానల్ 'టీవీ9'పై క్రిమినల్ కేసు పెడుతున్నా: రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన

  • తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది
  • న్యాయవాదులను సంప్రదిస్తున్నా
  • ఆధారాల సేకరణ జరుగుతోంది
  • ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ
తనపై తెలుగు టీవీ 9 చానల్ తప్పుడు వార్తలను పదేపదే ప్రసారం చేస్తోందని ఆరోపిస్తూ, ఆ చానల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాద్వారా వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన న్యాయవాదులతో చర్చిస్తున్నానని, కేసు పెట్టేందుకు తగ్గ ఆధారాలను సేకరిస్తున్నానని అన్నాడు. గతవారం చివరిలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందు రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకాగా, పలు టీవీ చానళ్లలో పెద్దఎత్తున కవరేజ్ లభించిన సంగతి తెలిసిందే. అయితే టీవీ9 తనకు వ్యతిరేకంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందన్న విషయాన్ని మాత్రం వర్మ తన ట్వీట్ లో వెల్లడించలేదు. ఇక రాంగోపాల్ వర్మ ట్వీట్ వైరల్ కాగా, పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తూ రిప్లై ఇస్తున్నారు.
Ramgopal Varma
TV9
Hyderabad
Police
CCS

More Telugu News