Telugudesam: అందుబాటులోని నేతలందరినీ వెంటనే రమ్మని చంద్రబాబు కబురు!

  • ఉదయం 10.30 గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
  • నిన్నటి రాజకీయ పరిణామాలపై చర్చించేందుకే
  • అఖిలపక్షం తేదీ, ఆహ్వానాల విషయంపైనా చర్చ
విజయవాడకు దగ్గర్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఈ ఉదయం 10.30 గంటలకు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిమిత్తం తన వద్దకు రావాలని చంద్రబాబు కబురు పెట్టారు. నిన్నటి రాజకీయ పరిణామాలపై చర్చించేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒత్తిడి పెరుగుతూ ఉండటం, అందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ సరేనని చెప్పడంతో, తదుపరి ఎటువంటి వ్యూహం అవలంబించాలన్న విషయమై సమాలోచనలు జరిపేందుకే అత్యవసర సమావేశానికి ఆయన పిలిచినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో, సమావేశం తేదీ, ఎవరెవరిని ఆహ్వానించాలన్న అంశాలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. ఆపై మరో రెండు రోజుల తరువాత సమన్వయ కమిటీ తిరిగి సమావేశమవుతుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Telugudesam
Jagan
Chandrababu
Pawan Kalyan

More Telugu News