Tollywood: హాస్యనటుడు గుండు హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి

  • ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
  •  అంతిమయాత్రలో పాల్గొన్న సన్నిహితులు
  • కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు
ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నిర్వహించారు. తన తండ్రి దహనసంస్కారాలను కుమారుడు ఆదిత్య పూర్తి చేశారు. గుండు హనుమంతరావుని చివరి సారిగా చూసేందుకు ఆయన అభిమానులు, మిత్రులు, సన్నిహితులు తరలి వెళ్లారు. కాగా, సనత్ నగర్ జెక్ కాలనీలోని గుండు హనుమంతరావు నివాసం నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కాగా, కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు ఈరోజు తుదిశ్వాస విడిచారు.
 
Tollywood
gunudu hanumantha rao

More Telugu News