Pawan Kalyan: ప్రధాని మోదీకి వైసీపీ భయపడుతోందని అర్థమైంది!: పవన్ కల్యాణ్

  • ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు బయటకు వెళ్లిన తీరు అనుమానాలకు బలాన్నిచ్చింది 
  • నేను ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్లే వ్యక్తిని కాదు
  • కేంద్రమంత్రి మండలిపై ఎదురుతిరగాలి
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం రహదారులపైకి వస్తాం
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడితే.. ఆ అవకాశం తెలుగు దేశం పార్టీకి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యంగ స్ఫూర్తిని హుందాగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తాను ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్లే వ్యక్తిని కాదని చెప్పారు.

ప్రధానమంత్రి మోదీకి వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తనకు అనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు బయటకు వెళ్లిన తీరు తన అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చిందని అన్నారు. కేంద్రమంత్రి మండలిపై ఎదురుతిరగాలని, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము రహదారులపైకి వస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Union Budget 2018-19
YSRCP
Jana Sena

More Telugu News