priya prakash: కేసులపై స్టే కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన ప్రియా వారియర్!

షార్ట్స్‌లో చూడండి
మలయాళ సినిమా ‘ఒరు ఆదార్‌ లవ్‌’లో ఓ పాటలో కన్ను గీటుతూ, హావభావాలు ఒలకబోస్తూ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ చేసిన అభినయానికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్ లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆ పాటలో ఆమె చూపిన హావభావాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్‌ కేసు నమోదైంది. అంతేగాక, ఈ సినిమాలోని సన్నివేశాలపై మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

దీనిపై ప్రియా ప్రకాశ్.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, తన సినిమా బృందంపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని పేర్కొంది. రేపు తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆమె కోరింది. సినిమాకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ కేసులు త్వరగా పరిష్కారం కావాలని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 
Go Back to Shorts
priya prakash
Kerala
Supreme Court

More Telugu News